ముగించు

జిల్లా సహకార కార్యాలయం

సహకార శాఖ గురించి వివరణ:

సహకార శాఖ కు సంబంధించి పాలనాదికారిగా సహకార సంఘాల రిజిష్ట్రారు మరియు కమీషనరు, తెలంగాణ హైదరాబాద్ గారు వ్యవహరించెదరు. మరియు జిల్లా పర్యవేక్షనాధికారిగా జాయింట్ రిజిష్ట్రారు/ జిల్లా సహకార అధికారి గారు వ్యవహరిస్తారు. మరియు పరిపాలన సౌలభ్యం కోసమై నిజామాబాద్ జిల్లాలో మొత్తం (9) క్లస్టర్ లు గా ఏర్పాటు చేయనైనది. ఒక్కో క్లస్టర్ 2 నుండి 5 మండలాలు కలిగి ఉన్నవి. అసిస్టెంట్ రిజిష్ట్రార్ సంబంధిత క్లస్టర్ అధికారిగా ఉంటూ వారికి సీనియర్ ఇన్స్ పెక్టర్లు మరియు జూనియర్ ఇన్స్ పెక్టర్లు సహాయకులుగా పనిచేయుచున్నారు. జిల్లాల పునర్వ్యవస్తీకరనములో సహకార శాఖ మార్పుచెంది డివిజినల్ సహకార అధికార కార్యాలయాలు మరియు జిల్లా సహకార ఆడిట్ అధికారి కార్యాలయాలు జిల్లా సహకార అధికారి కార్యాలయములో విలీనమైనవి.

శాఖ నిర్వర్తించు కార్యకలాపాలు:

తెలంగాణ సహకార సంఘముల చట్టము (టి సి స్ ఆక్ట్) 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘాల చట్టము (ఎమ్ ఎ సి స్ ఆక్ట్) 1995 క్రింద సంఘాలను రిజిష్ట్రేషన్ చేయడము మరియు వాటి పనితీరు మెరుగుపరచడం, ఆర్థికంగా ఎదగడం కోసం చేయుతనిస్తూ మరోవైపు వాటి పనితీరు సమీక్షిస్తుండడము సహకార శాఖ యొక్క ముఖ్యమైన విధి. మరియు తెలంగాణ సహకార సంఘముల చట్టము (టి సి స్ ఆక్ట్) 1964 లోని నిబంధనల ప్రకారము జిల్లా సహకార ఆడిట్ అధికారి గారు ప్రతి ఆర్ధిక సంవత్సరము మార్చి నెలాకరున సహకార శాఖ ఆద్వర్యంలో పనిచేయుచున్న సంఘాలకు మరియు ఫంక్షనల్ రిజిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉన్న సంఘాలకు ఆడిట్ నిర్వహించడము మరియు ఆడిట్ సర్టిఫికేట్లు జారీ చేసే బాద్యత కలిగి ఉంటారు.

సహకార శాఖకు సంబంధించిన పథకాలు వాటి వివరణ మరియు సంబందిత దరఖాస్తు:

  1. మొత్తం 87 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘము జిల్లాలో ఎరువుల వ్యాపారము నిర్వహిస్తూ, తద్వారా వివిధ రకాల ఎరువులను రైతులకు/సభ్యులకు సరఫరా చేయుచున్నవి.
  2. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు/సభ్యులకు సబ్సిడీ ద్వారా విత్తనాలను సరఫరా చేయుచున్నవి.
  3. రైతులకు/సభ్యులకు మద్దతుధరను చెల్లించుటకు గాను జిల్లా పరిపాలన అధికారి గారు అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో వరి, మొక్కజొన్న మరియు ఎర్రజోన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినారు.

తాజా అభివృద్ధి నివేదిక:

  1. 2016-17 సంవత్సరమునకు ఆడిట్ ప్రణాళిక – 764
    • ఆడిట్ పూర్తయిన సంఘాలు – 632
    • ఆడిట్ పూర్తికాని సంఘాలు – 132
  2. ఖరిఫ్-2017 సీజన్ లో వరి కొనుగోలు చేసిన సంఘాలు – 82
    • కొనుగోలు (క్వింటాళ్ళ లో) – 1405464
    • కొనుగోలు విలువ (కోట్ల లో) – 223.44

ప్రస్తుతము సంఘము చేపట్టుచున్న కార్యక్రమాలు:

శాఖ యొక్క ముఖ్యమైన లక్ష్యం సంఘ రైతులకు/సభ్యులకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక, మధ్య కాలిక ఋణాలు అందచేయడం, అంతేకాక ఎరువుల సరఫరా, విత్తనాలు, వరి మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను దళారుల నుండి కాపాడడము, జిల్లా నందు పరపతి విధానము సంభవ్యంగా ఉండి జిల్లాను పటిష్టంగా చేయడము లో ఒక భరోసా గా ఉంటూ సహకార ఉద్యమము పనిచేయుచున్నది.

అధికారుల పేర్లు మరియు ఫోను నంబర్లు
క్రమసంఖ్య అధికారి పేరు హోదా మొబైల్ నెంబర్
1 శ్రీ.కె.సింహాచలం డిప్యూటి రిజిష్ట్రార్/ఆడిట్ అధికారి మరియు జిల్లా సహకార అధికారి, నిజామాబాద్ (ఎఫ్.ఎ.సి) 9100115747
2 శ్రీ.డి.మేఘ్ రాజ్ అసిస్టెంట్ రిజిష్ట్రార్/ఎస్టాబ్లిష్ మెంట్/ప్రజా సంబంధాల అధికారి 9951213484
3 శ్రీ.ఎస్.శివకుమార్ అసిస్టెంట్ రిజిష్ట్రార్/స్టాచ్యుటరి  9866639414
4 శ్రీ.బి.పోషన్న అసిస్టెంట్ రిజిష్ట్రార్/ఆడిట్  9440384090
5 శ్రీమతి.టి.జయంతికుమారి అసిస్టెంట్ రిజిష్ట్రార్/క్రెడిట్ 9885568689
6 శ్రీమతి.ఐ.సుహాసిని అసిస్టెంట్ రిజిష్ట్రార్/నాన్-క్రెడిట్ 7386452347
7 శ్రీమతి. ఎస్.స్వప్న సీనియర్ ఇన్స్పెక్టర్ /సహాయ ప్రజా సంబంధాల అధికారి 08462-221005