ముగించు

డెయిరీ డెవలప్మెంట్

టిఎస్ డిడిసిఎఫ్ ద్వారా పాల ఉత్పత్తి అభివృద్ధి కార్యకలాపాలు

నిజామాబాద్ డెయిరీ 1970 లో సారంగపూర్, నిజామాబాద్ వద్ద స్థాపించబడింది. జిల్లా మొత్తం పాల ఉత్పత్తి 2.55 ఎల్ఎల్ పిడి ఉంది, అందులో 1.23 ఎల్ఎల్ పిడి స్థానిక వినియోగానికి పోను మిగిలిన 1.32 ఎల్ఎల్ పిడి పాలు విక్రయాయించడానికి అందుబాటులో ఉంది. కొన్ని ప్రైవేట్ డెయిరీలు పాలు మరియు పాల పదార్థములు ఉత్పత్తి చేయడానికి 1.07 ఎల్ఎల్ పిడి వరకు సేకరించడం జరుగుతుంది. టిఎస్ డిడిసిఎఫ్ ద్వారా 0.25 ఎల్ఎల్ పిడి సకరించడం జరుగుతుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై, నిజామాబాద్-ఆదిలాబాద్ మిల్క్ షెడ్ కింద పాడి కార్యకలాపాలు చేపట్టబడుతున్నాయి.
ఇప్పటివరకు, 15 నమోదిత మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సోసిటీలు మరియు 1964 టి ఎస్ సి ఎస్ చట్టం కింద రిజిస్ట్రేషన్ 126 పాలు సేకరణ కేంద్రాలు రిజిస్టర్ చేయడానికి మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం, పాలు కొనుగోలు ధర రూ .27 / – నుండి 56 రూపాయల వరుకు పాల నాణ్యత ఆధారంగా చలించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఆవు మరియు గేదె పాలకు అందనంగా తెలంగాణ ప్రభుత్వం ద్వార 4/- రూపాయలు ప్రోత్త్సహంగా ఇవ్వబడుతుంది.

నిజాంబాబాద్ జిల్లాలో పాల శీతలీకరణ కేంద్రాలు ఈ క్రింది విదంగా పని చేస్తున్నాయి.

బల్క్ పాలు శీతలీకరణ యూనిట్లు
వరుస సంఖ్యా బి ఎమ్ సి యూ యొక్క పేరు పథకం కెపాసిటీ ప్రెజెంట్ ప్రొక్యూర్మెంట్
1 బి ఎమ్ సి యూ -బోధన సి ఎమ్ యొక్క ప్యాకేజీ 5000 లీటర్లు 1200 ఎల్ పిడి
2 బి ఎమ్ సి యూ – ఆలూర్ ఆర్ కె వి వై ప్యాకేజీ 3000 లీటర్లు 800 ఎల్ పిడి
3 బి ఎమ్ సి యూ – వర్ని ఆర్ కె వి వై ప్యాకేజీ 5000 లీటర్లు 5500 ఎల్ పిడి
4 బి ఎమ్ సి యూ -నవీపేట్ ఆర్ కె వి వై ప్యాకేజీ 3000 లీటర్లు 1000 ఎల్ పిడి
5 బి ఎమ్ సి యూ – దరపల్లి ఆర్ కె వి వై ప్యాకేజీ 5000 లీటర్లు 1400 ఎల్ పిడి
6 బి ఎమ్ సి యూ – కోటగిరి సి ఎమ్ యొక్క ప్యాకేజీ 5000 లీటర్లు . 1100 ఎల్ పిడి

పాలు అమ్మకాలు ప్రస్తుతం 13000 ఎల్ పిడి మేరకు ఉన్నాయి.

విజయ పాల ఉత్పత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం:

తెలంగాణ రాష్ట్రా ప్రభుత్వం ద్వార రూ .4 / – నగదు ప్రోత్సాహకం నవంబరు 2014 నుండి విజయ పాడి రైతులకు చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు రూ. 14.5 కోట్లు పాల ఉత్పతిదారులకు డిబిటి మోడ్లో సుమారు 3902 పాల ఉత్పత్తిదారులకు వారి బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగింది.

విజయ ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ తో సుక్ష్మక్రిమిరహిత డబుల్ టోన్డ్ మిల్క్ సరఫరా

మొత్తం నిజామాబాద్ జిల్లాలో, అరొగ్యలక్ష్మి పథకం కింద ఐసిడిఎస్ ప్రాజెక్టుల ద్వార మొత్తం 2500 అంగన్వాడీ కేంద్రాలకు విజయ సుక్ష్మక్రిమిరహిత డబుల్ టోన్డ్ పాలు రోజుకు 5500.0 లీటర్ల సరఫరా చేయడం జరుగుతుంది.

డిపార్ట్మెంట్ యాక్టివిటీస్:

  1. జిల్లాలో సమీకృత పాల ఉత్పత్తికి రేషన్ బాలెన్సింగ్ ప్రోగ్రామ్ పురోగమిస్తోంది (ఆహార సమతుల్య తతో మరింత పాల దిగుబడి సాధించడానికి).
  2. విజయ పాలు మరియు పాల పదార్థంల ఉత్పత్తి అమ్మకం కొరకు విజయ మిల్క్ పార్లర్లను నిజామాబాద్ మరియు బోదన్లలో పట్టణలలో స్థాపించడం జరిగింది. అంతేకాక, బసర్, అర్మేర్ వద్ద పార్లర్లను ప్రారంభించాలని ప్రణాళిక చేశాం.
  3. ఒక కొత్త బి ఎమ్ సి యూ 3000 lit. సామర్థ్యం తో త్వరలోనే తల్లారంపూర్, యర్గాత్లా మండల్, నిజామాబాద్ జిల్లా లో ప్రారంభమవుతుంది.
  4. పైలట్ ప్రాతిపదికన కాఫ్ రేరింగ్ ప్రోగ్రాం ప్రారంభమవుతుంది.

డిపార్ట్మెంట్ పథకాలు:

  1. ఐ డి డి పి పథకం: కొత్త బి ఎమ్ సి యూ ల ఏర్పాటు, పాల టెస్టింగ్ పరికరాలు కొనుగోలు చేయడం
    మరియు కొత్త పాల సేకరణ కేంద్రాలు తెరవడానికి.
  2. సి ఎమ్ ప్యాకేజీ: మండల్ స్థాయిలో కొత్త బి ఎమ్ సి యూ యొక్క స్థాపన.
  3. ఎన్ పి డి డి పథకం: గడ్డి వితనాలు అభివృద్ధి మరియు గ్రామా స్థాయిలో నాణ్యతగల పాలను ఉత్పత్తి చేయుట గురించి.